telugu navyamedia
రాజకీయ

కశ్మీర్ టూర్‌ ను బహిష్కరించిన ట్రావెల్ ఏజెంట్లు

Provide Bulletproof vechicles CISF
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐదేళ్ల పాటు కశ్మీర్ టూర్‌ ను బహిష్కారించాలని ట్రావెల్ ఏజెంట్లు నిర్ణయించారు. గుజరాత్‌లోని సౌరాష్ట్రకు చెందిన 200 మంది ట్రావెల్ ఏజెంట్లు ఐదేళ్లపాటు  ఒక్క టిక్కెట్ కూడా కశ్మీర్ టూర్‌ కు బుక్‌చేసుకోకూదని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా తమ దేశ భక్తిని చాటుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా తమకు రూ. 300 కోట్ల నష్టం వస్తుందని, అయినప్పటికీ  దేశభక్తే తమకు ముఖ్యమని చెబుతున్నారు. 
అయితే వీరి నిర్ణయంతో కశ్మీర్ ఏజెంట్లు  ఆందోళనచెందుతున్నారు. ఇలాంటి ఆలోచనను విరమించుకోవాలని వారు ట్రావెల్ ఏజెంట్లను వేడుకుంటున్నారు. అలాగే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీనిస్తున్నారు. కాగా ట్రావెల్ ఏజెంట్లు తీసుకున్న నిర్ణయానికి 70 మంది రైల్వే ఏజెంట్లు కూడా మద్దతు పలుకుతున్నారు.

Related posts