ee-nagaraniki-emaindi

ఆదివారం “ఈ నగరానికి ఏమైంది ?”…!?

12

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న”ఈ నగరానికి ఏమైంది ?” చిత్రం ట్రైలర్ ను ఆదివారం రోజున విడుదల చేయనున్నారు.

“పెళ్ళి చూపులు” చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. “పెళ్ళి చూపులు” చిత్రం విడుదలైన చాలా రోజుల తరువాత ఇప్పుడు మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తరుణ్ భాస్కర్ తన కొత్త సినిమాకు “ఈ నగరానికి ఏమైంది ?” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే “ఈ నగరానికి ఏమైంది ?” చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో సుశాంత్ రెడ్డి, విశ్వక్సేన్ నాయుడు, వెంకటేష్ కాకమాను, అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇది నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథని సినిమా మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి “పెళ్ళి చూపులు” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న తరుణ్ భాస్కర్ ఈ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.