telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ట్రాఫిక్ పోలిసుల కష్టాలు.. కాసుల వర్షాలు..!

traffic porns and corns by and to public
హైదరాబాద్ మహానగరం..ఎందరో తమ కలలను పెనవేసుకున్న, త్వరగా అభివృద్ది చెందుతున్న నగరం. అతి తక్కువ ఖర్చుతో బ్రతకగలిగిన నగరం కావటంతో, రోజు లక్షల మందిని ఆకర్షిస్తుంది. దీనితో రోజురోజుకూ విశాలంగా విస్తరిస్తున్న ఈ నగరంలో చాలా పెద్ద సమస్యగా ట్రాఫిక్ అందరికి చికాకు తెప్పిస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి కూడా ఎన్నో ప్రభుత్వాలు ఏవేవో చేశాయి. ఇటివలే అందుబాటులోకి వచ్చిన మెట్రో కూడా ఈ సమస్యకు తగిన పరిష్కారం కాలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ట్రాఫిక్ పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు.
నగరంలో ప్రతి కూడలిలో ఒకరిద్దరు ట్రాఫిక్ అదికారులు కనిపించక మానరు. నిరంతరం ఎక్కడా ట్రాఫిక్ జాం కాకుండా వీళ్లు చేసే కృషి అభినందనీయం. ఇక మహా నగరంలో కనిపించే మరో సమస్య, ప్రయాణికుడు తన వాహనాన్ని ఎక్కడ పార్క్ చేయాలి అనేది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం వచ్చిందంటే..నగరంలో ఎంత ట్రాఫిక్ సమస్య ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 
traffic porns and corns by and to publicaఅయితే ప్రతి దానిలో మంచి చెడు ఉంటాయి అన్నట్టుగా, ఈ కష్టాలు కొందరికి మాత్రం ఆదాయ మార్గాలు అయ్యాయి. ఇందులో ప్రధానంగా, అనుమతులు లేని చోట వాహనాలు నిలిపినా, ఇష్టానికి ట్రాఫిక్ నిబంధనలు అధిగమించినా..అదికారులు చెలానా లతో వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా తమ తమ పనులలో బిజీగా ఉంటూ, హడావుడిగా ప్రయాణాలు చేస్తున్న ప్రజలు కూడా చేసేది లేక, చెలానాలు కడుతూనే ఉన్నారు. ఒక స్థాయిలో ఈ ఆదాయం ప్రభుత్వానికి ప్రధాన వనరు అయ్యింది అంటే కూడా అతిశయోక్తి కాదు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇందులో ఇంకో మెలిక కూడా ఉంది.
అదేమంటే, భలే అవకాశం అంటూ, ట్రాఫిక్ అధికారులలో కొందరు అధికార దుర్వినియోగం చేస్తూ, ఇష్టానికి ప్రయాణికులను రోడ్డుపై ఆపి, ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదని వాళ్ళ చేయి తడిపితేగాని వదలని స్థితి. ఇలాంటివి ఎంతగా ఎక్కువ అయ్యాయి అంటే, ఇటువంటి అధికారులకు వారి ఉద్యోగం ఎటిఎం కార్డు అయిపోయింది. వాళ్లకి ఎప్పుడు డబ్బులు కావాలంటే, అప్పుడు వాళ్ళ డ్యూటీకి సిద్దం అవుతున్నారు. ఇది పార్కింగ్ వరకు పాకింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి ప్రభుత్వం కూడా పరిష్కారం చూపలేకపోవడంతో అటు ప్రభుత్వానికి చెలానా రూపకంగాను, ఇటు  అధికారులకు ఎటిఎం గానూ.. ఈ సమస్యలు చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఎప్పటి లాగానే వీళ్ల మద్య ప్రయాణికుడు బలిపశువు అవుతున్నాడు. 
ఇక ఈ లెక్కల విషయానికి వస్తే, రోజుకు లక్షలు, నెలలో కోట్లు.. ఇందులో అధికారిక లెక్కలెన్నో.. ఎటిఎం లెక్కలెన్నో .. !!

Related posts