tpcc chief utham on trs govt

తెలంగాణలో దుర్మార్గ పాలన : ఉత్తమ్ కుమార్ రెడ్డి

19

సీఎం కేసీఆర్ ఆది నుంచి అందరినీ బెదిరించే ధోరణినే అనుసరిస్తున్నారని, తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చండూర్‌లో దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి విగ్రహాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వాయిలార్ రవి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. నియంతృత్వంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేశారని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు వారికి అండగా ఉంటామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నాలుగేళ్ల తర్వాత రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రుణమాఫీ వడ్డీ భారాన్ని భరిస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని. అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు .