telugu navyamedia
తెలంగాణ వార్తలు

పార్టీ నిర్ణ‌యానికి ఎవ‌రూ అతీతులు కాదు..ఎవ‌రూ మొన‌గాళ్ళు కాదు

*సిన్హాను క‌లిస్తే ఎవ‌రినైనా గోడ‌కేసి కొడ‌తా..
*సిన్హా ను క‌లిసేదే లేద‌ని టీపీసీసీ నిర్ణ‌యం
*పార్టీ నిర్ణ‌యానికి ఎవ‌రూ అతీతులు కాదు..ఎవ‌రూ మొన‌గాళ్ళు కాదు
*రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్‌లో మ‌ళ్ళీ క‌ల్లోలం..

విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన యశ్వంత్ సిన్హా హైద‌రాబాద్‌కు వచ్చారు. యశ్వంత్ సిన్హా పర్యటనకు దూరంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశించినా… సీనియర్ నేత వి.హనుమంతరావు మాత్రం ఆయన మాటలను పక్కనబెట్టారు. స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. సీఎం కేసీఆర్‌ తో కలిసి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. పార్టీ నిర్ణయాన్ని వీహెచ్ ధిక్కరించడం కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు.. ఇది రాజకీయ పార్టీ. అధిష్టానంతో మాట్లాడి.. పార్టీ నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకుంది. అర్థం పర్థం ఉండాలి. ముతి మతి తప్పి వ్యవహరిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవడైనా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని అన్నారు.

పిల్లలాటలు ఆడితే.. తీసి గోడకేసి కొడతామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలకు ఎవరూ అతీతులు కాదని.. ఎవ్వరూ మొనగాళ్లు కాదని అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి.

యశ్వంత్ సిన్హా తమ కోసం రాలేదని..టీఆర్ఎస్ మద్దతు అడగడానికే వచ్చారని.. తాము ఎందుకు ప్రత్యేకంగా వెళ్లి మద్దతు ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు.

నా ఇంటికి వచ్చి తలుపు తడితే తాను తీస్తాను కానీ పక్కింటికి వెళ్లి తలుపు తడితే తానేందుకు తీస్తానని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను మొదట కలిస్తే.. యశ్వంత్ సిన్హా నే కాదు బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదని స్పష్టం చేశారు.

Related posts