వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు.
ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏపీ తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బాట పట్టారు.
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్ ప్రచారం చేయనున్నారు, ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే వారణాసిలో ప్రచారం చేపట్టారు.
ఇక ఏపీలోని బీజేపీ అగ్రనేతలు జీవీఎల్ నరసింహరావు, భాను ప్రకాశ్ రెడ్డి, హర్షవర్ధన్ తదితరులు వారణాసిలో మోదీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు.
అయితే వారణాసిలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. మోదీ గెలుపులో వారి ఓట్లు కీలకం కానున్నాయి.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన కీలక నేతలంతా వారణాసికి చేరుకుని మోదీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక వారణాసిలో తుది దశ పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది.