telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈద్ ముబారక్… టాలీవుడ్ సెలెబ్రిటీల రంజాన్ విషెస్

EID-Mubarak

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ముస్లిం సోదరులంతా ఇళ్లలో ఈద్‌ను జరుపుకుంటున్నారు. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ముస్లింలంతా ఉపవాస దీక్షలు చేస్తారు, ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తారు, దానధర్మాలు చేస్తారు. రంజాన్ మాసం ముగింపులో భాగంగా నెలవంక కనబడిన రోజు ఈద్ ఉల్ ఫితర్‌ను ఘనంగా నిర్వహించుకుంటారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలంతా ఈద్ ఉల్ ఫితర్‌ను జరుపుకుంటున్నారు. అయితే, ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులకు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నటసింహా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాచో హీరో గోపీచంద్, సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, రాశీ ఖన్నా, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇలా చాలా మంది సోషల్ మీడియా ద్వారా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, బాలకృష్ణ ప్రత్యేకంగా వీడియో మెసేజ్ ద్వారా ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ‘‘ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్. లాక్‌డౌన్‌లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని వేడుకుంటున్నా’’ అని తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో బాలయ్య పేర్కొన్నారు.

Related posts