telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మే 29 వరకూ టాలీవుడ్ బంద్… ఎలాంటి మినహాయింపు లేదు

Tollywood

కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. స్కూళ్ళు, కాలేజీలు సహా అన్ని మూతపడ్డాయి. ఇందులో భాగంగానే సినిమా, సీరియళ్ల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీంతో మొత్తం సినీరంగం కుదేలయ్యింది. ఇండస్ట్రీని నమ్ముకుని బ్రతుకుతున్న జూనియర్ ఆర్టిస్టులు, రోజువారీ కూలీలు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో సినిమాలు, సీరియల్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా వెసులుబాటు ఉంటుందని నిర్మాతలు భావించారు. అయితే తెలంగాణలో అలాంటి మినహాయింపు ఏమి లేదని.. మే 29 వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

Related posts