telugu navyamedia
సినిమా వార్తలు

క్రిస్మస్ బరిలో 5 బడా సినిమాలు

Tollywood

సాధారణంగా దక్షిణాదిన దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు వచ్చాయంటే పెద్ద సినిమాల హడావుడితో బాక్సాఫీస్ వ‌ద్ద కూడా పండుగ వాతావ‌ర‌ణం ఏర్పడుతుంది. అయితే ఈ ఏడాది ద‌స‌రా పండుగ‌కి “సైరా” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి పోటీగా ఏ చిత్రం విడుద‌ల కానుంద‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే క్రిస్మ‌స్‌కి మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని తెలుస్తుంది. ర‌వితేజ న‌టిస్తున్న “డిస్కోరాజా” చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానుండగా… నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “భీష్మ” సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా విడుదల కాబోతున్నట్టు ఇటీవ‌ల చిత్రబృందం ప్రకటించింది. క్రిస్మ‌స్ పండుగ‌కి మ‌రికొన్ని చిత్రాలు కూడా సంద‌డి చేసేందుకు సిద్ద‌మ‌య్యాయి. శ‌ర్వానంద్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌ల‌యాళ చిత్రం “96” రీమేక్ ను క్రిస్మ‌స్‌కి విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారట. ఇక మారుతి, సాయిధ‌రమ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న “ప్రతీరోజూ పండగే” చిత్రం కూడా క్రిస్మ‌స్‌కే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. ఇక వెంకీ, చైతూ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న “వెంకీ మామ” కూడా క్రిస్మ‌స్ కే బరిలోకి దిగనుంది. ఇదంతా చూస్తుంటే ఈ ఏడాది క్రిస్మ‌స్‌కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ పోటీ ఉండనుందట.

Related posts