telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అదే మీరు నాకు ఇచ్చే నిజమైన కానుక…” ఫ్యాన్స్ కు రామ్ రిక్వెస్ట్

RP

ఇటీవ‌ల కాలంలో డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో క‌లిసి ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో వ‌చ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ప్ర‌జంట్ రామ్.. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే చిత్రంలో న‌టించాడు. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల‌న ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. ఈ సినిమా కోసం అత‌డి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 15న హీరో రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా తన అభిమానులకు రామ్ ఓ విజ్ఞప్తి చేశారు. “నా ప్రియమైన అభిమానులకి, మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టినరోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో, అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను… ప్రస్తుత విపత్కర పరిస్థితుల రీత్యా ఈసారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం! ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే.. నాకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను” అంటూ తన అభిమానులకు రామ్ విజ్ఞప్తి చేశారు.

Related posts