telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్ 17, ఆదివారం రాశి ఫ‌లాలు..

మేషం..
ముఖ్య పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి చేకూరుతుంది.పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాట పడవలసి వస్తుంది. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం, ఆకస్మిక ధనప్రాప్తి వంటి శుభపరిణమాలున్నాయి. పారిశ్రామికవేత్తలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం..
రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

మిథునం..
కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి.ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు.వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులకు నూతనోత్సాహం క‌లుగుతోంది. 

కర్కాటకం..
ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. నూతన వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఒక సమాచారం మీలో సంతోషం కలిగిస్తుంది. ఏ పనులు చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.అజీర్ణబాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం.

సింహం..
షాపులలో పనిచేసే వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. గొప్పవారి ప‌రిచ‌యం ఏర్పడుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌ల‌ను క‌లిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌర‌విస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్యమిస్తారు.

కన్య ..
హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని పనులు నిదానంగా సాగినా సకాలంలోనే పూర్తి కాగలవు బంధు మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులున్నా వెసులుబాటు ఉంటుంది. బాకీలు, ఇంటి అద్దెలు తదితర ఆదాయాలను సౌమ్యంగా వసూలు చేసుకోవాలి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

తుల..
ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు అనూహ్యంగా అవకాశాలు దక్కుతాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. శకునాలు, ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బంధువుల నుంచి సమస్యలు తలెత్తుతాయి.

వృశ్చికం..
గృహోపకరణాల కొనుగోలుకై చేయుయత్నాలు ఫలిస్తాయి.మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు దక్కుతాయి.

ధనస్సు..
వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు, లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో అంత సఖ్యత ఉండదు. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీపై వచ్చిన అపవాదులు తొలగి గౌరవాభిమానాలు కలుగుతాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.

మకరం..
ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి పునఃపరిశీలన, ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో మెళుకువ చాలా అవసరం. రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

కుంభం..
స్త్రీలకు పని ఒత్తిడి, హడావుడి అధికం. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. కొన్ని క్లిష్ట సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. భాగస్వామ్య రంగంలో వారికి చికాకులు తలెత్తుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం..
కొత్త పనులు చేపట్టి శ్రమపడినా పూర్తి చేస్తారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.

Related posts