నేడు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం 10-30 గంటలకు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించడంపై చర్చించనున్నారు; అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు సీఆర్డీఏపై జగన్ సమీక్ష చేయనున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సీఆర్డీయేపై సమీక్ష జరుపుతున్నారు. అమరావతి నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అమరావతిలో ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎం గత ప్రభుత్వం ఖరారు చేసిన ప్లాన్ లను మార్చుతున్నారా.. లేక అవే కొనసాగిస్తారా..అనేదానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.