To be inspired by youth ..

యువతలో స్ఫూర్తి నింపడానికే…

10
మనం ఎక్కడికైనా వేళలంటే ఒక రోజు ముందే మన సామగ్రిని సద్దుకుంటాం కానీ ఒక జంట తమ ప్రయాణానికి రెండున్నర ఏళ్ళు పాటు శ్రమ పడి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అంత సమయం ఎందుకనుకుంటున్నారా,  ఇక్కడే ఉంది అసలు సంగతి. వాళ్ళు ప్రయాణించింది విమాన ప్రయాణం కాదు అమెరికా నుంచి హైద్రాబాద్ కు కార్ ప్రయాణం. దేశాలు ఖండాలు దాటి కార్ లో ప్రయాణించడం అంటే మన ఊహకే కష్టం, కానీ ఒక జంట దాని సాధించారు. ఏకంగా అమెరికా నుండి హైద్రాబాద్ కు కారు లో వచ్చేశారు,  నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం, కారు నడుపుకుంటూ ఆ వైద్య దంపతులు అమెరికా లోని క్యాలిఫోర్నియా నుంచి సికింద్రాబాద్ చేరుకున్నారు.       
సికింద్రాబాద్ కు చెందిన రాజేష్, దర్శన దంపతులు అమెరికాలో డాక్టర్ లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. దర్శన కి టాప్ 100 డాక్టర్స్ లో ఒకరిగా మంచి పేరు ఉంది, అయితే వృత్తి పై ఎంత పేరున్న  స్వదేశం పై ఎక్కువ ప్రేమ ఉంది, అలానే ప్రపంచం చుట్టిరావాలనే కోరికా ఉంది. దీనితో రాజేష్, దర్శన దంపతులు  అమెరికాలోని క్యాలిఫోర్నియా  నుండి సికింద్రాబాద్ కు కారు లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రెండున్నర ఏళ్ళు దీనికి తగట్టు అన్ని సమకూర్చుకున్నారు.   దాదాపు 2 నెలలు ప్రయాణ సమయం పడుతుందని ఊహించారు, అందుకు తగట్టుగా వాహనం, భోజన వసతి, బట్టలు వీటితో పాటు వివిధ దేశాల అనుమతులు కూడా తీసుకోని ప్రయాణించారు. 
 To be inspired by youth ..  
   మూడు ఖండాలు,19 దేశాలు, 62 రోజుల ప్రయాణం ఇది.  డాక్టర్ రాజేష్, దర్శన దంపతుల  సాహసం. ఏప్రిల్ 11న క్యాలిఫోర్నియా లో బయల్దేరారు, క్యాలిఫోర్నియా నుంచి ప్యారిస్ వరకు కారును ఫ్లైట్ లో తీసుకొచ్చారు. అక్కడ నుంచి బ్రెజిల్, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, ఖజకిస్తాన్, కలికిస్తాన్, మంగోలియా, చైనా, టిబెట్, నేపాల్  మీదుగా భారత్ లోకి అడుగుపెట్టారు. ముందే ఈ దేశాల నుండి అనుమతులు తీసుకుని రాజేష్, దర్శన దంపతులు ప్రయాణించారు. చైనా లో సమస్యలు ఎదుర్కొన్నా సురక్షితంగా భారత్ చేరుకున్నాము, భారత్ లో యువతకు స్ఫూర్తి నింపడానికే మా ఈ యాత్ర అంటున్నారు ఈ  డాక్టర్ దంపతులు.