తిరుమల పుణ్యక్షేత్రం మీదుగా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు.
ఆగమ శాస్త్ర సూత్రాలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.
తిరుమల కొండపై తక్కువగా ఎగురుతున్న విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యకలాపాలు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్ర వాతావరణాన్ని భంగపరుస్తున్నాయని పేర్కొంది.
తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేందుకు, ఈ విషయంలో కేంద్రమంత్రి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ లేఖలో కోరారు.