telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలపై కరోనా ఎఫెక్ట్ .. తగ్గిన భక్తుల రద్దీ!

tirumala temple

కరోనా ప్రభావంతో తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో స్థానికంగా దర్శన టికెట్లు మంజూరు చేయకపోవడంతోక్కువగా గురువారం 4,834 మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. వీరిలో 1,589 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ద్వారా రూ. 43 లక్షల ఆదాయం లభించిందని వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న వారిలోనూ పలువురు దర్శనానికి రావడం లేదని తెలిపారు.

కాగా, రేపు గరుడ పంచమి కావడంతో, అధికారులు ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి గరుడపంచమి నాడు, తనకు ఇష్టమైన గరుడ వాహనంపై స్వామివారు తిరు మాఢ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వాల్సివుంది. అయితే, కరోనా కారణంగా, ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ సేవను ఏకాంతంగా నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Related posts