telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

తలనొప్పికి .. ఇంటి చిట్కాలు.. !

tips to overcome headache

పొద్దున్న లేస్తే ఆరోగ్యంగా ఉండాలని బోలెడన్ని ప్రయత్నాలు చేస్తుంటాం… అయినా చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కారణంగా ఏవేవో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పిని తగ్గించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది..

* లవంగాలు, కర్పూరాన్ని కాటన్‌ క్లాత్‌లో కట్టి పంటినొప్పి ఉన్నచోట పెట్టి పళ్లతో గట్టిగా నొక్కి పట్టాలి. ఇలా చేస్తే పంటినొప్పి తగ్గిపోతుంది.

* ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని తల మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.

tips to overcome headachea* అరకప్పు నీటిలో ఒక టీస్పూను అల్లం రసం కలిపి వేడిగా తాగాలి. రెండు గంటలకొకసారి తాగుతుంటే అతిసారం పూర్తిగా తగ్గుతుంది.

* అసిడిటీతో కాని అజీర్తితో కాని బాధపడుతుంటే ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక టీ స్పూను అల్లం రసం కలిపి తాగాలి.

* ఒక లీటరు నీటిలో నాలుగు స్పూన్‌ల చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి మరిగించి చల్లార్చి వడపోయాలి. ఈ ద్రవాన్ని తరచుగా తీసుకుంటే సమస్య అదుపులోనికి వస్తుంది. శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి అందుకుంటుంది.

* ఈ వేసవి కాలంలో శరీరానికి సరైన నీటి అవసరాలను తీర్చకపోయినా కూడా తలనొప్పి రావచ్చు, అందుకే తగినన్ని నీటిని తీసుకోవడం మంచిది.

Related posts