telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

బానపొట్ట .. సాధారణ స్థితికి .. ఇలా తెచ్చుకోండి.. !

tips to get fatty belly to normal state

నేటి ఉద్యోగాలలో ఎక్కువ శాతం తక్కువ శారీరిక శ్రమ, ఎక్కువ మానసిక శ్రమతో కూడినవి కావటంతో సహజంగా అందరిలో కనిపిస్తున్న సమస్య అధిక పొట్ట. దీనిని పిలుచుకోడానికి అనేక పేర్లు ఉన్నప్పటికి, ప్రభుత్వ అధికారుల నుండి నేటి మేటి ఐటీ ఉద్యోగుల వరకు అందరికి ఈ సమస్య పరిచయమే. దానిని తగ్గించుకోడానికి కూడా వారిలో చాలా మంది అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.. అనేది కూడా వాస్తవం. మరో ప్రయోజనం.. వారికే తెలియాలి. కానీ ఇదిగో ఇక్కడ కొన్ని చిట్కాలు చూద్దాం.. వాటిలో మీ బెల్లీ తగ్గడం ఖాయం…

ఉసిరి :
ఏ సీజన్ లో లభించేవి, ఆ సీజన్ లో ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకుంటుండాలి. అప్పుడే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఉసిరి కాయలు కూడా ఈ సీజన్ లో బాగా లభ్యం అవుతాయి. వంటిని తరచూ ఆహారంలో వివిధ రూపాలలో చేర్చుకోవడం వలన అధిక బరువు త్వరగా తగ్గవచ్చు. దీనితో పొట్టభాగం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. బరువు తగ్గాలి అనేవారికి ఉసిరి కంటే బాగా మేలుచేసేది మరొకటి ఉండదు. రోజు పొద్దున్నే ఖాళీ కడుపుతో, ఉసిరికాయ రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

జీలకర్ర :
ఇది కూడా కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. రోజు జీలకర్రతో కాషాయం చేసుకొని తాగితే, జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో ఉన్న చెడు కొవ్వును కరిగించి, బయటకు పంపడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

మెంతులు :
మెంతులు ఆకలిని తగ్గిస్తాయి. దీనితో బరువు సహజంగా తగ్గిపోతారు. రాత్రిపూట మెంతులు నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగి, మెంతులను కూడా తినేసేయాలి. దీనివలన త్వరగా ఆకలి వేయదు, ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది.

even sugar patients can take ghee healthyదాల్చిన చెక్క :
ఇది కూడా కొవ్వును కరిగించడంలో చక్కగా పనిచేస్తుంది. ఈ పొడిని వేడినీటిలో కలిపి తాగితే శరీరం మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరిగి, అధిక బరువు తగ్గిపోతారు. పొట్ట దగ్గర కొవ్వు కరిగించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుంది.

త్రిఫల చూర్ణం :
ఈ చూర్ణం రోజు గ్లాస్ గోరువెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ కలిపి తీసుకుంటే, నెల రోజులలో పొట్ట తగ్గే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. ఈ చూర్ణం వలన జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొవ్వు అధికంగా ఏర్పడకుండా ఉంటుంది. ఈ నీటిని రాత్రి నిద్రకి ముందు తీసుకోవాలి.

Related posts