telugu navyamedia
ఆరోగ్యం

మోకాళ్ళ నొప్పులు నివారణకు చిట్కాలు..

ఎక్కువగా పెద్ద వయసువారికి ఈ సమస్య చాలా సాధారణంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కానీ, ఇటీవల కాలంలో మోకాలి నొప్పితో బాధపడుతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. వయసు పైబడిన వారు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. ఇందుకు ప్రధాన కారణం కీళ్ల దగ్గర తగినంత జిగురు లాంటి పదార్థం ఉండకపోవడం. దీన్ని అధిగమిస్తే ఎప్పుడైనా మోకాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. బెండకాయలో జిగురు ఉందని అది తింటే జిగురు వస్తుందని తింటుంటారు. నీ వీటివల్ల ప్రయోజనం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మోకాళ్ల సమస్యకు చిట్కాలు..

* రుచి కోసం ఉప్పు వేసుకుంటున్నాం, తప్పదు కనుక కొద్ది మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి శ్రేయస్కరం. రుచి కోసం చూస్తే, మీరు అధికంగా తినే ఉప్పు మోకాళ్లలో, కీళ్ల వద్ద జిగురు ఉత్పత్తి అవకుండా అడ్డుకుంటుంది. మనం అధికంగా తిన్న ఉప్పు బయటకు వెళ్లే అవకాశాలు తక్కువ.

*ప్రతిరోజూ శారీరక శ్రమ చేయాలి. చెమట వచ్చేలా కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు, యోగా, లేక వ్యాయామం, జిమ్ లాంటివి చేస్తే స్వేదం ద్వారా లవణాలు బయటకు వెళ్లిపోతాయి. కీళ్లు దగ్గర జిగురు నిల్వ ఉండేందుకు దోహం చేస్తుంది. దాంతో లేచినా, కూర్చున్నా జిగురు ఉండటం వల్ల కీళ్ల రాపిడి తగ్గి మోకాళ్ల నొప్పులు రావు.

*విటమిన్ సి కావాలనుకునే వారు నిమ్మరసం తాగాలి. విటమిన్ సి పుష్కలంగా లభించే.. పైనాపిల్, జామ, స్ట్రాబెర్రీ, కివి, మామిడి పండ్లను ఆయా సీజన్ ప్రకారం తినాలి. తద్వారా మోకాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు.

*కొన్ని సీజన్లలో యూరిన్ (మూత్రం) ఎక్కువసార్లు వస్తుందని నీళ్లు తక్కువగా తాగుతారు. దీనివల్ల శరీరంలోని ఉప్పు బయటకు వెళ్లదు. ఈ తప్పు అసలు చేయవద్దు. దీనివల్ల కిడ్నీలో రాళ్లు సైతం ఏర్పడే సమస్య ఉంది. అప్పుడు మోకాళ్ల నొప్పులతో పాటు మరిన్ని అనారోగ్య సమస్యలు.

*అధిక బరువు కారణంగానూ మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు వస్తాయి. కనుక కాస్త బరువు తగ్గడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

* అల్లంలో అనాల్జెసి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది మోకాళ్ల నొప్పులను నివారిస్తుంది. మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నప్పుడు అల్లం టీలో పసుపు కలిపి తాగితే సరిపోతుంది. ఒక గ్లాసు నీటిలో చిన్న అల్లం ముక్కను, సగం చెంచా పసుపును వేసి 10-15 నిమిషాలు మరిగించి తేనె కలుపుకుని తాగితే మంచిది. ఇలా వారానికి రెండు సార్లు చేసినా మోకాళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి.

 

Related posts