telugu navyamedia
ఆరోగ్యం

అందాన్ని సంరక్షించుకోవాటనికి పలు చిట్కాలు..

*సమతుల్యమైన ఆహారం, విటమిన్లు ఉన్న ఆహారము లేదా విటమిన్లు క్రమంగా తీసుకోవాలి.
*యాంటి ఆక్సిడెంట్స్‌ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
*కొవ్వు పదార్ధములు ఎక్కువగా తీసుకోకూడదు.
* కళ్లకు మేకప్‌ వేసుకునే ముందే చల్లని దోసకాయ గుజ్జులో దూదిని ముంచి కను రెప్పలపై ఉంచాలి. దీనితో కళ్లు ఫ్రెష్‌గా ఉంటాయి.
*టమాటా, దోస రసాలు ఒక్కొక్క స్పూను, కొన్న నిమ్మచుక్కలు, ఒక టేబుల్‌ స్పూన్‌ కిస్మిస్‌లు కలిపి.. ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత
గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
*పావు టేబుల్‌ స్పూను నిమ్మరసంలో 2 టేబుల్‌ స్పూన్ల తురిమిన కమలాఫలం తొక్కలు, కొంచెం పాలు కలిపి రోజంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దీనిని బాడీ లోషన్‌గా కూడా వాడవచ్చు.
*ఒకటిన్నర టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కమలాఫలం తొక్కలు, ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్, నూనె ఇవన్నీ కలిపిన మిశ్రమంతో శరీరానికి మృదువుగా మర్దనా చేయాలి. చర్మంపై మృతకణాలు, బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి.
* ఓ పచ్చి క్యారెట్ తింటే రోజంతటికీ సరిపడా విటమిన్లు శరీరానికి దొరుకుతాయి, కళ్లు, శరీర బాహ్య కణజాలాన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఏ, ఎక్కువగా లభిస్తుంది.
*తాజా ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీర ఆకృతిని, ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయి. శరీర అందానికి విటమిన్ సి, విటమిన్ ఇ, ముఖ్యమైనవి. విటమిన్ సి నిమ్మ, నారింజ జాతి పండ్లలో పుష్కలంగా ఉంటుంది.
*యాపిల్‌లో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. శరీరంలోని విషపదార్థాలను, కొలెస్ట్రాల్ స్థాయిని యాపిల్స్ తగ్గిస్తాయి. ఊపిరి తిత్తులు సక్రమంగా పనిచేసేందుకు ఇది పనిచేస్తుంది.
* వేళకు నిద్రపోవాలి, రోజూ వ్యాయామం చేయాలి, చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడొద్దు, ఎక్కువ ఒత్తిడికి గురికావొద్దు, ప్రతిరోజూ మృదువైన సబ్బుతో స్నానం చేయాలి,
*ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి.

Related posts