telugu navyamedia
రాజకీయ

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ..

*రాజ‌కీయ పార్టీ పెడుతున్న‌ట్టు పీకే ప్ర‌క‌ట‌న‌..
*బీహార్ నుంచి త‌న ప్ర‌యాణం ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. ఈ మేర‌కు ప్రశాంత్ కిషోర్ సోమవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. తన సొంత రాష్ట్రమైన బీహార్‌ నుంచి తన ప్రయాణం మొదలుపెడుతున్నట్లు తెలిపారు.

ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిని అయి, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో పదేళ్లు గడిచాయి. ఇక‌నుంచి ‘జన్ సూరజ్’ ప్రజా సమస్యలను, వారి మార్గాన్ని బాగా అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు.

సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నానని. ..బిహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద ఆయ‌న పార్టీ పేరును రిజిస్ట‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ ట్వీట్‌తో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు దాదాపు ఖరారు అయ్యింది.

ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పలుమార్లు చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్.. ఆ పార్టీకి 2024 ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేశారు.

ఈ క్రమంలోనే ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చలు ఫలించకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరలేదు.

మరోవైపు కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో పీకే.. తెలంగాణకు వచ్చి గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపారు.  తెరాస.. ఐప్యాక్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ప్రశాంత్​ కిశోర్​ వ్యూహాలు, సూచనలతో ఎన్నికలకు వెళ్లేందుకు ఒప్పందం సైతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ పరిస్థితుల్లో ప్రశాంత్​ కిశోర్​ ప్రత్యక్ష రాజకీయాల్లోకివస్తున్న‌ట్లు ప్రకటన చేయడం గమనార్హం.

Related posts