Thrissur Committee on Agrigold Assets

అగ్రిగోల్డ్ ఆస్తులపై త్రిసభ్య కమిటీ…

30

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి లైన్ క్లియర్ అయింది, దీనికోసం త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా లీగల్ సర్వీస్ సెక్రెటరీ తో కమిటీ ఏర్పాటు చేసి, కమిటీతో కలిసి ఆస్తులు వేలం వేయాలని సీ.ఐ.డి ని ఆదేశించింది. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఆస్తులు వేలం వేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. మొదట గుర్తించిన పది ఆస్తుల్లో ఐదు ఆస్తుల వేలంపై ప్రకటనలిచ్చి కేవలం ఆరు వారాల్లోనే ప్రక్రియ పూర్తిచేయాలని తీర్పులో పేర్కొంది.

ఆస్తులకు సంబందించిన తదుపరి విచారణను జూన్ 25కు వాయిదా వేసింది, రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో ఆస్తుల వేలంపై వెనక్కి తగ్గిన ఎస్.ఎల్ గ్రూప్ మళ్లీ తిరిగి ఆస్తులు కొనిగొలు చేస్తామని కోర్టుకు దాఖలాలు చేయగా, పరిశీలించిన కోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.