telugu navyamedia
సామాజిక

తిరుమ‌ల ఘాట్ రోడ్లు బంద్‌ ..

తిరుమ‌ల శ్రీ‌వారి కొండ‌కు వెళ్ళే ఘాట్ రోడ్ల‌ను టీటీడీ బోర్డు బంద్ చేసింది. భ‌క్తుల ర‌క్ష‌ణ కోసం టీటీడీ బోర్డు ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల‌ దేవ‌స్థానానికి వెళ్ల‌డానికి రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఈ రెండు ఘాట్ రోడ్ల ల్లో ప్ర‌యాణించే భ‌క్తుల‌ను కాపాడ్డానికి టీటీడీ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ రెండు ఘాట్ రోడ్ల‌ను రాత్రి 8 గంట‌ల నుంచి రేపు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మూసివేయ‌నున్నారు.

అయితే, మ‌ళ్లి ఈ రోడ్ల‌ను రేపు ఉద‌యం 6 గంట‌ల‌కు తిరిగి వాహ‌నాల‌ను అనుమ‌తి ఇస్తారు. ఘాట్‌ రోడ్డుల లో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఘాట్ రోడ్ల‌ను మూసి వేస్తున్నారు. అలాగే, తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు సాయంత్రం 7 గంటలలోపు ప్రయాణం చేయాల‌ని టీటీడీ బోర్డు తెలిపింది. అయితే, గ‌త కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు త‌మిళ నాడు రాష్ట్రాల‌లో వ‌ర్షాలు భారీగా ప‌డుతున్నాయి. దీంతో ప‌లు చోట్ల కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి.

Related posts