మళ్ళీ మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభుస్తుంది. అది క్రమంగా పెరుగుతూ ఆక్టోబర్ నాటికి మరింత కేసులు ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతా బాగుందనే భావనతో కరోనా నియమాలు పాటించకపోవడం మాస్క్‌లు పెట్టుకోకపోవడం, గుంపులు గుంపులుగా కనిపించడం, రెస్టారెంట్లు, పబ్‌లు, పార్టీలు పెళ్ళిళ్లు అంటూ తిరగుతుండటంపై కొంత ఆందోళన వ్యక్తమౌతోంది.
రెండేళ్ళుగా రెండు లాక్‌డౌన్లు, వివిధ రకాల ఆంక్షలతో ప్రజలు విసిగి వేసారి పోయారు. ఇలాంటి క్రమంలో కోవిడ్ జాగ్రత్తలను పట్టించుకోకపోతే మళ్లీ కేసులు పెరిగి థర్డ్‌వేవ్‌కు దారితీసే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ మహమ్మారికి సంబంధించి రాబోయే 2, 3 వారాలు కీలకంగా మారనున్నాయి.
దేశంలో మూడోదశ కరోనా ఆగస్ట్‌లో మొదలై అక్టోబర్‌కల్లా తారస్థాయికి వెళ్లొచ్చని తాజాగా అంచనా వేశారు. ఈ నెలలో దేశంలో రోజుకు లక్షన్నర కేసుల వరకు నమోదు కావొచ్చని హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోని వైరస్ ఉద్ధృతి థర్డ్‌వేవ్‌కు ఉండవచ్చని, అయితే సెకండ్‌వేవ్‌లో మాదిరిగా రోజుకు నాలుగు లక్షల కేసులు, పెద్ద సంఖ్యలో మరణాలు వంటి అత్యంత తీవ్రస్థాయి ఉండక పోవచ్చన్నారు. రెండవ దశ మొదలై 5 నెలలు అవుతుంది. అప్పుడే దేశంలో కరోనా కేసులు సంఖ్య 40వేల దాకా నమోదు అవుతున్నాయి. అయితే ఇందులో ఎక్కువగా కేరళ నుంచి నమోదవుతున్నట్లు తెలుస్తుంది.
అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోవడం తప్పనిసరి అంటున్నారు. వ్యాక్సినేషన్ పెరిగే వరకు ఇలాంటి స్థాయి ఉంటుందని, దేశ జనాభాలో 7.6% మంది వ్యాక్సినేషన్ ఉపయోగించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోజాగ్రత్తలు పాటించని వారితో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
ఏపీ గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన!