sujatha

విజయవాడలో నకిలీ పోలీసులు…

38

విజయవాడలో నకిలీ పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. నగర శివారులోని పెద్దపులి పాకలో ఓ ఇంట్లో సుజాత అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉంటుందని కాపు గాసిన నకిలీ పోలీసులు ఇంట్లోకి వెళ్లి మాటలు కలిపి ఆ వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను, ఇంట్లో ఉన్న నగదును దోచుకు పోయారు. సుజాత తెలిపిన సమాచారం మేరకు వారు పోలీసుల దుస్తుల్లో వచ్చారని మాటలు కలిపి మాయ చేశారని వాపోయింది.

సుజాత నోటికి ప్లాస్టర్ వేయడంతో తెల్లవారుజాము వరకు దోపిడీ జరిగిన సంగతి ఎవరికీ పొక్కలేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఒక వైపు మైనర్ బాలికలపై అత్యాచారాలు, మరోవైపు విద్యార్థినీలపై లింగిక వేధింపులు, ఇప్పుడు చివరకి వృద్ధురాలి ఇంట్లో కూడా చోరీలు వీటన్నింటిని చూస్తుంటే దేశం అన్యాయానికి ముందడుగులో నడుస్తుందని చెప్పుకోవచ్చు. సమాజ మార్పు కోసం పోలీసులే కాకుండా సామాన్య ప్రజలు కూడా కష్టపడి ప్రజలను చైతన్యవంతులుగా మర్చి అన్యాయాలకు మోసాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు చెప్పుకుంటూ వస్తున్నారు. శిక్షలు విదించినంత మాత్రాన తిరిగి నేరం చేయరు, నేరాలు ఆగిపోతాయి అనడం కన్నా ప్రజల్లో మార్పులు చేకురితే నేరాలు తగ్గుతాయనడం ఉత్తమం.