these 7 raw vegetables are harm to health

ఈ కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమే..!

133

రోజువారీ మనం తినే వంటకాల్లో పోషక విలువలు సమానంగా అందుతున్నాయో లేదో ఎప్పుడైనా గుర్తించారా? మనం తినే కూరగాయల్లో కొన్ని పచ్చివి తినకూడదని తెలుసా? పచ్చి కూరగాయలను కొందరికి ఉడికించకుండానే తినే అలవాటు ఉంటుంది, కానీ ఆలా తినడం చాలా ప్రమాదమని పోషక స్థాయి తగ్గిపోతుందని, అలా తినడం వలన జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతింటుందని న్యూట్రీషియన్ పూజా మల్హోత్రా అంటున్నారు. మనం నిత్యం తినే కూరగాయాలని శుభ్రంగా కడిగి ఉడికించిన తరువాతనే తినాలని, పచ్చి కూరగాయలను ఉడికించి తినడం వచ్చే పోషక విలువలు చాలా ఎక్కువగా అందుతాయని అలాగే గుడ్లు మాంసం ఉడికించినప్పుడు సమానమైన పోషకాలు అందుతాయంటున్నారు.

మీరు తినకూడదని 7రకాల పచ్చి కూరగాయలు… వండినప్పుడు ఆరోగ్యకరమైనవి…

1. బంగాళ దుంపలు (Potatoes)

ఉడకబెట్టిన బంగాళదుంపలను, చపాతీలో కాని ఇతర వంటకలలో కలిపి వండితే రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. కానీ బంగాళదుంపలు పచ్చిగా తినకూడదు. బంగాళాదుంపలు పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి, సులభంగా జీర్ణం అవుతుంది. పచ్చి బంగాళా దుంపలు తింటే ఉబ్బసం వంటి జీర్ణశయాంతర సమస్యలకు దారి తీయవచ్చు. అలాగే, మీరు చాలా కాలం పాటు ముడి బంగాళాదుంపలను నిల్వ చేస్తే, ఆకుపచ్చ మచ్చలు వస్తాయి, ఇది సాలినైన్ సమ్మేళనం కారణంగా వస్తుంది. అలాంటి బంగాళాదుంపలను తినే ఆహారంలో వాడకపోవడమే మంచిది. చక్కగా ఉడికించిన బంగాళా దుంపలను తిని పోషకవిలువలు పెంచుకొవచ్చు.

Potatoes

2. ఆస్పరాగస్ (Asparagus)

క్యాన్సర్ పోరాట సమ్మేళనాల్లో ఆస్పరాగస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు, వాటిని తినడం ఖచ్చితంగా మీకు ఎలాంటి హాని లేదు. పచ్చిగా కూడా తినవచ్చు కాని ఉడికించి తింటే పోషక విలువలను ఎక్కువగా పొందవచ్చు. ఇవి ఒక రకమైన ఆకు కూరలు, సీజన్ లో మాత్రమే లభిస్తాయి.

Asparagus

3. పుట్టగొడుగులు (Wild Mushrooms)

పుట్టగొడుగులు చాలా ఆరోగ్యకరమైనవి, దీని గురించి ఎటువంటి సందేహం లేదు. అయితే, వాటిని పచ్చిగా తీసుకోవడం వళ్ల మీ జీర్ణ వ్యవస్థపై కఠినంగా వ్యవహరిస్తోంది. పుట్టగొడుగులను జీర్ణశక్తికి దారి తీయనివ్వడమనేది ఉడికించడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Wild mushrooms

4. వంకాయ (Eggplant)

వంకాయని ఎప్పుడు పచ్చిగా తినకూడదు, మనం నిత్యం చేసే పొరపాటు వంకాయలను, బంగాళదుంపలను కలిపి తింటాము అలా తినడం ద్వారా సోలానైన్ అను రసాయన సమ్మేళనం కి హాని జరుగుతుంది. తాజాగా ఉన్న వంకాయలు సేకరించాలని పచ్చి వంకాయలు తినడం ద్వారా జీర్ణశయాంతర సమస్యలు తలెత్తుతాయని ఉడికించిన తరువాత తింటే సురక్షితంగా ఉండవచ్చు.

Eggplant

5. క్యాబేజి (Brussels sprouts)

ఎన్నో ఔషధ గుణాలున్న క్యాబేజీని పచ్చిగా తినడం ద్వారా ఎలాంటి ప్రయోజన ఉండదని, జీర్ణవ్యవస్థపై భారం తప్ప ఇంకేమి రాదంటున్నారు. అదే క్యాబేజీని పానీయాలతో కలిపి ఆలివ్ ఆయిల్ మరియు ఉప్పు వేసి ఉడికించి రుచి కరంగా తాయారు చేసుకోవచ్చని, తద్వారా ఆరోగ్య ప్రయోజనాలు గరిష్టంగా పొందవచ్చు.

Brussels-sprouts

6. బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ (Broccoli and Cauliflower)

ఈ క్రుసిఫెరస్ కూరగాయలు పచ్చిగా తినడం ద్వారా జీర్ణ పరంగా ఇబ్బందిని కలిగించవచ్చు. వీటిని తేలికగా ఆవిరితో లేదా కొన్ని నూనెలతో పాన్లో వేగించిన తరువాత తింటే సులభంగా జీర్ణం చేసుకోవచ్చు, తగిన పోషక విలువలు పొందవచ్చు. 

Broccoli-and-Cauliflower

7. బచ్చలి కూర (Spinach)

మనం సాధారణంగా బచ్చలి కూరను సలాడ్ల రూపంలో నిత్యం తింటూ ఉంటాము, ఇకపై సలాడ్లలో స్పైనాచ్ ను దూరం పెట్టడమే మేలు. కాని బచ్చలి కూరలో ఇనుము, మెగ్నీషియం అధిక స్థాయిలో దొరుకుతుంది. చాలా ఆరోగ్యకరమైన ఈ కూరను ఉడికించిన తరువాత తీసుకొని ఆరోగ్యవంతులుగా జీవించండి.

Spinach