thefts in temple

కంటితో చూసేవన్నీ…నిజాలు కావనేది…ఇందుకేనా…?

7
అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో జరిగిన ఘటన అర్చకుల విశ్వసనీయతను ప్రశ్నింస్తుంది. ఆలయంలోని పూజారులు చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలే ఇపుడు జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది.  సి సి టీవీ లో రికార్డు అయిన ఒక పూజారి వ్యవహారం కలకలం రేపుతోంది.
వరంగల్ అర్బన్ జిల్లా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఒక ప్రధాన దేవాలయం స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు శఠగోపం పేటి ఆశీర్వదించాల్సిన పూజారులు దేవుడి హుండీ పై కన్నేశారనే ఆరోపణులు వచ్చాయి. ఈ నెల 7వ తేదీన హుండీ జరగాల్సి ఉంది. 5వ తేదీ తెల్లవారుజామున ఎవరూలేని సమయంలో ఒక అర్చకుడు ఒంటరిగా వచ్చి గర్భగుడి తలుపు తెరిచాడు. పూజలు ఏమి చేయకుండానే గుడిలోని లైట్లు, సి సి కెమెరాలు ఆపేశాడు. సుమారు 13 నిమిషాల పాటు గుడిలో అంధకారం నెలకొంది. ఆ తరువాత బైటకు వచ్చిన పూజారి తన చేతిలో ఒక కవర్ పట్టుకుని బైటకు వేళాడు. అప్పటికే బైక్ పై ఉన్న ఇంకో పూజారితో కలసి వెళిపోయాడు. ఒక సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు వారి వ్యవహారంపై అనుమానాలకు తావిస్తున్నాయి.
డ్యూటీ లేని పూజారి తెల్లవారు జామున గుడిలోకి  ఎందుకు వచ్చాడు ?
వచ్చిన స్వామి వారికి పూజలు చేయకుండా ఎందుకు వెళిపోయాడు ?
పూజారి గుడి నుండి వెళ్లేప్పుడు అతని చేతులో కవర్ ఉంది, ఆ కవర్ లో ఏమి ఉంది?
గుడిలో 13 నిమిషాల పాటు సీసీ కెమెరాలు, లైట్లు ఎందు ఆపేశారు?
ఇన్ని ప్రశ్నలకు తావిచ్చిన ఆ సందర్భం ఇప్పుడు ప్రజలలో అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనిపై విచారణ చేయాల్సిన అధికారులు అలాంటివి ఏమి జరగలేదని చెబుతున్నారు. అయితే గర్భగుడిలో స్వామివారి విలువైన వస్తువులు అపహరణ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ టీవీ లో రికార్డు అయిన దృశ్యాలు ఆధారంగా విచారణ చేసి అసలు ఏమి జరిగిందనేది తేల్చాలని భక్తులు కోరుతున్నారు.