telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

యజమానులు జైల్లో.. దొంగ ఇంట్లో

మాములుగా దొంగలు జైల్లో ఉంటారు. యజమానులు ఇంట్లో ఉంటారు. కానీ ఇంకడా మాత్రం యజమానులు జైల్లో ఉంటె దొంగ ఇంట్లో ఉన్నాడు. అయితే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి కాలనీ లో భారీ చోరీ జరిగింది. ఇంటి యజమానులు ఒక్క కేసు వివాదం లో శిక్ష అనుభవిస్తున్న తరుణంలో గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటి పై కన్నేసి దాదాపుగా కిలో బంగారం కొన్ని డాకుమెంట్స్, సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ ఇంటిని ఉదయం సాయంకాలం  పర్యవేక్షణ చేస్తున్న బంధువులకు ఈ రోజు అనుమానం రావడం తో పూర్తిగా చెక్ చేస్తే దొంగతనం జరిగినట్టు అనిపించి స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ,క్లూస్ టీం ,క్రైమ్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బంధువులు మాట్లాడుతూ శిక్ష అనుభవిస్తున్న మా బంధువుల ఇంటి తాళాలు పోలీసులు ఆధీనంలోనే ఉన్నాయని ఆ తరుణంలోనే ఇంత పెద్ద దొంగతనం జరిగిందని అన్నారు. ఆ ఇంట్లో కిలోకి పైగా బంగారం భారీగా నగదు ఉన్నట్లుగా బంధువులు తెలిపారు. సీసీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్ళడంతో పోలీసులు ఈ కేసును ఎలా చేదిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల చల్ గా మారింది.

Related posts