BREAKING NEWS:
Theater shut down for making piracy cds

పైరసీకి పాల్పడ్డ థియేటర్ మూసివేత…

47

చలన చిత్ర రంగం, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పైరసీ సీడీలు తయారు చేసే తీరు మాత్రం ఎక్కడా మారడం లేదు, రోజుకొక తీరుగా పైరసీలను ముద్రిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో మైలాడుతురై లోని గోమతి సినిమా థియేటర్ లో పైరసీ చిత్రిస్తున్నారన్న సమాచారం రావడంతో, రైడ్ చేసి థియేటర్ ను సీజ్ చేశారు.

తమిళనాడులో పైరసీ సీడీల విక్రయం రోజు రోజుకు పెరుగుతుంది, ఒక్కరోజు వ్యవధిలోనే సినిమాను ఇంటర్ నెట్ లో సంబందించిన వెబ్ సైట్లలో పెడుతున్నారు. అయితే రెండు వారాల క్రితం తమిళనాడులో విడుదలైన కుప్పై కథై చిత్రం ఇంటర్నెట్లోను, పైరసీ సీడీల రూపంలోకి రావడంతో చిత్ర నిర్మాతలు కడలూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే పేరొందిన గోమతి థియేటర్ లో పైరసీలు ముద్రించినట్లు కనుగొంది.

 Theater shut down for making piracy cds

కేసులో భాగంగా థియేటర్ యాజమాన్యాన్ని విచారించగా యాజమాన్యం చెప్పిన విషయాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. విదేశాలకు పేటెంట్ హక్కు ఇస్తే దాని ద్వారా దొంగతనంగా సినిమా లీక్ అవుతుందన్నారు. అయితే నిర్మాత తెలిపిన వివరాల ప్రకారం కుప్పై కథై చిత్రానికి ఎలాంటి విదేశీ హక్కు జారీ చేయలేదని, ఇంటర్నెట్ లో మరియు పైరసీ సీడీల రూపంలో సినిమా బయటకు రావడం తీవ్ర దిగ్భ్రాంతి ని గురిచేస్తుందన్నారు.

మైలాడుతురై గోమతి థియేటర్ లో తయారవుతున్న పైరసీ సీడీ లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయని పైరసీని ఇలా కూడా చేయవచ్చా అన్న ఆశ్చర్యానికి గురి చేసింది. కేసు తేలడంతో థియేటర్ ని సీజ్ చేసి కారకులైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పైరసీలు ఇలాగే తయారైతే చిత్ర నిర్మాతలు అడుక్కుతినాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు.