ఇవి మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు, ఏపీ ప్రజల కోసం..రెండున్నరేళ్లలో నష్టపోయిన ప్రతి వ్యక్తి కోసం టీడీపీ గెలవాల్సిన యుద్ధం ఇది అని చంద్రబాబు అన్నారు.
ఈ మున్సిపల్ ఎన్నికలు నాలుగు దశల పోరులో టీడీపీ సైన్యం మూడు విజయాలు సాధించింది. అభ్యర్థిత్వం, నామినేషన్ ఉపసంహరణ.. ఈ ఘట్టాలలో అధికారం అండతో చెలరేగిపోయిన YSRCP అరాచకాలకు వీరోచితంగా ఎదురొడ్డి నిలిచారు. చివరికి మిగిలింది – పోలింగ్… మీ పోరాటఫలితం దక్కే చివరి అంకం ఇది.
YSRCP మన అభ్యర్థులను భయపెట్టడానికి, దాడి చేయడానికి పోలీసులు, రౌడీలు, డబ్బుని ఇబ్బడిముబ్బడిగా ఉపయోగించింది. YSRCPకి ఉన్న ఇన్ని బలాలు, తాయిలాలని ఎదిరించి టీడీపీ శ్రేణులు పోరాడి మూడు అంచెల్లో విజయం సాధించారని గుర్తించుకోండి.
వైఎస్సార్‌సీపీని టీడీపీ విజయవంతంగా ఓడించి, హింస, బెదిరింపులతో అన్యాయమైన ఎంపికలు జరగకుండా నిలువరించగలిగారు. జిత్తునక్కల గుంపుపై సింహంలా పోరాడి అభ్యర్థులను నిలబెట్టిన కార్యకర్తలకు, కష్టపడి పనిచేసిన నేతలు, అభ్యర్థులకు ఈ విజయం అంకితం.
మూడు దశల్నీ మీ స్వశక్తి, ప్రజాబలంతో విజయవంతంగా అధిగమించేశారు. ప్రచారానికి మనకి ఐదు రోజులు ఉన్నాయి. చివరి దశకు పూర్తి శక్తిని కూడకట్టుకుని ప్రతి నిమిషాన్ని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఉపయోగించాలని, నేను తెలుగుదేశం సైన్యానికి పిలుపునిస్తున్నాను.
ప్రతి తలుపు తట్టండి.. మీ కష్టాలు త్వరలో తీరుతాయని ప్రజలకి విడమరిచి చెప్పండి. ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం టీడీపీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇవ్వండి. ప్రజల పక్షమై పోరాడుతున్న ప్రతిపక్షం మనది అని వివరించండి.
రాష్ట్రాన్ని కాపాడేందుకు యువత, మహిళలు, రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. విజయం మన ముంగిట్లోనే ఉంది.. ఇదే పోరాటస్ఫూర్తితో ప్రజాబలంతో అధికారమదాన్ని ఓడించండి. మార్పు మొదలైంది…తీర్పు మనవైపే ఉంది..
విజయీభవ..
దిగ్విజయీభవ..
– నారా చంద్రబాబు నాయుడు