telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జోగి రమేశ్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చిన పోలీసులు

ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఉదయం జోగి రమేశ్ తనయుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేశ్ దాడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.

Related posts