telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

గాయపడిన దేహం

prema hrudayam poetry corner

గాయపడిన దేహాలన్నీ
పిల్లన గ్రోవులే కాకపోవచ్చు

ఉలిదెబ్బలు తిన్న గుడిమెట్లపై ఉండే
కొన్ని శిల్పాలు కావచ్చు

మరికొన్ని గుడిలో పుజలందుకుంటూ
ఉండే మూలవిరాట్టులు కావచ్చు

సరిహద్దులో తూటా దెబ్బలకు
నేలకొరిగినవీ,
పరోపకారానికై గాయాల్నీ
గేయాలుగా లేపనంగా పూసుకునేవీ కావచ్చు.

అదుగో చూడు మిత్రమా …
నీ చుట్టూనీ ఎదురుగా నీ ఇంటిలో …

అమానవీయ విలువలకు నిత్యం నిలువెల్లా గాయపడిన అభాగినులూ

జీవితాన్ని ఈదలేక కష్టాల సుత్తి దెబ్బలు తినేరాతి‌ మనుషులూ

అన్నీ గాయపడ్డ దేహాలే….

కానీ గెలిచి నిలిచిన స్థితప్రజ్ఙులని
మాత్రం మరువకు

🙏సైదులు ఆరేపల్లి 🙏

Related posts