ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసింది.
జీఎల్ఐ, జీపీఎఫ్ కు చెందిన రూ. 6,200 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రేపు లేదా ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయి.
నిధుల విడుదలపై ఉద్యోగులు, ఎన్జీవో అసోసియేషన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు.
జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా.. రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోంది: నన్నపనేని