happy-wedding

“హ్యాపీ వెడ్డింగ్” అంటున్న నిహారిక

15

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటిస్తున్న చిత్రం “హ్యాపీ వెడ్డింగ్”. పాకెట్ సినిమా సంస్థ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. అయితే తమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర టీం ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

నిహారిక ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె. నిహారిక ఇంతకుముందు “ఒక మనసు” చిత్రంతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసింది. కానీ ఈ చిత్రంలో నిహారిక నటనపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు తొలి సినిమా “ఒక మనసు”తోనే ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ “హ్యాపీ వెడ్డింగ్” తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసారైనా నిహారిక మంచి విజయాన్ని సాధిస్తుందేమో వేచి చూడాల్సిందే…!