కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్ విద్యార్థి సంఘాల నాయకులు ఇయన ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.
పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీస్ లు ఎమ్మెల్సీ వెంకట్తో పాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు.
వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు.