telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అర్ధరాత్రి నగ్నంగా నడిరోడ్డుపై మహిళ… పోలీసులకు షాక్

Woman

వెస్ట్ నాష్విల్లెలో ఉండే ప్రిన్సెస్ డెనిస్ డే (35) అనే మహిళ ఆగస్టు 12న రాత్రి 11.52 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి సమీపంలోని రోడ్డుపై నగ్నంగా తిరుగుతోంది. అదే సమయంలో అటువైపుగా పెట్రోలింగ్‌కు వెళ్లిన పోలీసులు డెనిస్ డేను చూశారు. ఆమె దగ్గరికెళ్లి చూస్తే ఒంటిపై నూలు పోగు కూడా లేదు. చేతిలో ఉన్న టీషర్టును కూడా పోలీసులను చూసి పక్కకు పడేసింది. మద్యం మత్తులో ఇలా చేస్తుందేమోనని అనుకుంటే ఆమె మాములుగానే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇలా ఎందుకు తిరుగుతున్నావని అడిగిన పోలీసులకు ఆమె చెప్పిన సమాధానం షాక్‌కు గురిచేసింది. ఇంట్లో ఉక్కపోతగా ఉండడంతో బయట చల్లగాలి కోసం వచ్చానని చెప్పింది. దాంతో పోలీసులు డెనిస్ డేను బట్టలు వేయించి అదుపులోకి తీసుకున్నారు.

Related posts