telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తెనాలి రామకృష్ణ .. టీజర్ ..

tenali ramakrishna movie teaser

జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై.. యంగ్ హీరో సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. కామెడీ, యాక్షన్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్నీ సమపాళ్లలో ఈ చిత్రంలో ఉన్నట్టుగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుత టాప్ కమెడియన్స్ అందరూ ఈ చిత్రంలో దర్శనమిస్తున్నారు. అలాగే సందీప్ కిషన్ కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో హిట్టందుకున్న సందీప్ కిషన్‌ ఈ చిత్రంతో మరో హిట్టు కొట్టడం ఖాయం అనేలా టీజర్ ఉంది.

ఒకవేళ కేసు పూర్తిగా ఓడిపోతే.. 100 పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్’ వంటి ఆఫర్లతో పాటు ‘వాడి తల ఎగరాల్సిందే.. గద్దలు ఎత్తుకెళ్లాల్సిందే’ వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్, మంచి లవ్ స్టోరీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో టీజర్‌ను కట్ చేసి సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు. సందీప్ కిషన్, హన్సిక, మురళీశర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్, బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్, శ్రీనివాస్ ఇందుమూరి నిర్మాతలు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Related posts