ఆంద్రప్రదేశ్‌లోని బంగాళాఖాత తీర ప్రాంతం విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. లంబసింగిలో 11 డిగ్రీసెల్సియస్, చింతపల్లిలో 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. అరకు, పాడేరు తదితర ఏజెన్సీ ప్రాంతంలో చల్లటిగాలులు వీస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో సాయంత్రంనుంచి చలిపెరిగిపోతోంది. పొగమంచు దట్టంగా వ్యాపించి చూపరులను ఆకట్టుకుంటోంది. లంబసింగి, చింతపల్లి, అరకు, పాడేరు వాసులు చలితీవ్రతకు వణికిపోతున్నారు. వృద్ధులు చిన్నపిల్లలు చలితీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు.
పొగమంచు ఆవరించడంతో వాహనచోదకులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పదిగంటలు దాటినా చలిగానే ఉంటోందని అక్కడి నివాసితులు చెబుతున్నారు.
ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు సమాచారం: లోకేశ్