telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వార్ : జైజై శివశంకర్ వీడియో సాంగ్

War

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వార్”. ఈ చిత్రంలో వాణీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుద‌ల కానుంది.హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లోని హృతిక్, టైగర్ స్టంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. ఇటీవల విడుదలైన ట్రైల‌ర్ లోని సీన్స్ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేశాయి. భారీ ఖర్చుతో తెరకెక్కించిన ఈ సాంగ్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమాలో ఎవరు ఊహించని భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు చిత్ర యూనిట్ బాగా ప్రమోట్ చేస్తోంది. దాదాపు 7 దేశాల్లో డిఫరెంట్ యాంగిల్స్ లో ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంబందించిన పాటలతో కూడా వార్ యూనిట్ ప్రమోషన్ లో డోస్ పెంచుతోంది. రీసెంట్ గా ఒక రొమాంటిక్ సాంగ్ తో టాలీవుడ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన వార్ గ్యాంగ్ ఇప్పుడు జై జై శివ శంకర్ అనే పాటను తెలుగులో రిలీజ్ చేశారు. సాంగ్ లో హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts