telugu girl in Femina Miss India 2018

ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు తెలుగమ్మాయి…

76
తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ మిస్ ఇండియాగా గెలిచి, జూన్ 19 న జరగబోయే ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు సిద్దమైన తెలుగమ్మాయి శ్రేయారావు కామవరపు. 55వ మిస్ ఇండియా అందాల పోటీల్లో మొత్తం 30 రాష్ట్రాల అమ్మాయిలు పోటీ పడనున్నారు. ఫెమీనా మిస్ ఇండియా 2018 ఫైనల్స్ ముంబైలో జరుగుతాయి. అయితే ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి ‘మనుషి ఛిల్లర్’ మిస్ ఇండియా కిరీటాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ టైటిల్ ను గెలుచుకున్నవారు అంతర్జాతీయంగా జరిగే ముఖ్యమైన నాలుగు అందాల పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా  పొందుతారు.

అయితే శ్రేయారావు గురించి కొన్ని విషయాలు ఆమె మాటల్లోనే… “హైదరాబాద్ లోని చిరక్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యాబ్యాసాన్ని పూర్తి చేసి, వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ లో డిగ్రీ పట్టా పొందాను. హైదరాబాద్ లో ఆర్కిటెక్చర్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న సమయంలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జిమ్ చేసి 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం ముగించి సాయంకాలం జాగింగ్ చేస్తూ, డ్యాన్స్ క్లాసులకు వెళ్తూ ఇష్టమైన దాన్ని కష్టపడి చేసుకుంటూ వచ్చాను. మా అమ్మానాన్నల ఆశీస్సులు ఉన్నాయి. అలాగే నేను ఈ పోటీలో గెలవడానికి తెలుగువారందరి ఆశీస్సులు కావాలి. తప్పకుండా గెలుస్తాననే నమ్మకం ఉంది” అని చెప్పింది. 

ముఖ్యంగా మా అమ్మగారి సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఇంత స్టేజ్ లో నిలిచానని, మిస్ ఇండియా పోటీలకు వెళ్తున్నాను అన్నపుడు ఆనందాలకు అవధులు లేకుండా పోయాయని, దానికి తోడుగా దేవుడు పంపిన స్నేహితులు నాతో ఉన్నంత కాలం కొండంత బలం నాకుంటుందని, అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞురాలిని అని తెలిపారు. 

ఇష్టమైనవి:
సంగీతానికి బానిస, డాన్స్ కు ప్రేమికురాలు, అత్యధిక ఫిట్ నెస్, పెయింటింగ్, ఆర్కిటెక్చర్ వృత్తిని ఆస్వాదించడం, రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ మరియు త్రోబాబ్ ప్లేయర్ గా గెలిచాను.

సినిమాలు ఎంతిష్టమో ట్రావెలింగ్ కూడా అంతే ఇష్టమట. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు కొత్త కొత్త ఆహారపు అలవాట్లతో యూరప్, బ్యాంకాక్ లాంటి ప్రదేశాలు పర్యటించడం…  మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఎంతో ఇష్టమట. 

మెంటర్ గా రకూల్ ప్రీత్ సింగ్ ఎంతో ఆదరించేదని, కష్టపడితే ప్రతిఫలం దానంతట అదే వస్తుందని నమ్మకంతో చెప్పేదని, ప్రతి చిన్న దాన్ని అర్థమయ్యేలా చెప్పేదని చెప్పారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ లకు వీరాభిమానిని అని అంటున్నారు. 

తల్లి దండ్రులు పుట్టిన ప్రదేశాన్ని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రసెంట్ చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందని, వారు చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగినందుకు బాధ్యతగా వ్యవహరిస్తానని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ మిస్ ఇండియాగా గెలుపొందిన వీడియో…