టాలీవుడ్ ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నాడు తెలుగు ఫిలిం ఛాంబర్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలివివేస్తున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వయంగా అన్నారు.సమస్యల పరిష్కారం దొరికేంత వరకు ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు.
టాలీవుడ్‌లో సమస్యలు ఉన్నాయి.. నిర్మాతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. పెరిగిపోతున్న నిర్మాణ వ్యయాన్ని అదుపులో పెట్టాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నారు.
హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకుంటే తప్ప నిర్మాణ వ్యయం అదుపులోకి రాదని నిర్మాతలు భావిస్తూ ఉన్నారు. కేవలం హీరోల రెమ్యునరేషన్ల వల్లే బడ్జెట్లు పెరిగిపోతున్నాయా.. అనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది.