telugu director caught on sex rocket in usa

వ్యభిచార దందా…దేశప్రతిష్ఠను విదేశాలలో తాకట్టు…

61

ప్రపంచంలో వ్యభిచారం అనే జాడ్యం మొదలైన సమయం ఏదైనా ఇప్పటి జీవితాలను తారుమారు చేస్తుంది. ఆదేశం, ఈ దేశం అనే తారతమ్యం లేకుండా ప్రతి చోట ఈ విషసంస్కృతి వేళ్ళు పాతుకుపోయాయి. కొన్ని చోట్ల దీనిని వృత్తిగా పరిగణించాలని ఆందోళనలకు దిగుతున్నారంటే ఇది ఎంతగా పాతుకుపోయిందో ఊహించుకోవచ్చు.

ఇటీవల యూఎస్ లో భారతదేశానికి చెందిన ఓ తెలుగు నిర్మాత, ఆతని భార్య వ్యభిచార దందా లో దొరికిన వార్త ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తుంది. కిషన్ మోదుగుముడి(విభా జయం), చంద్ర మోదుగుముడి చికాగో లో ఈ దందా చేస్తున్నట్టు తేలింది. వీరు తెలుగు హీరోయిన్ లను, వ్యాఖ్యాతలను షూటింగ్ అని తీసుకువచ్చి అక్కడ వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నట్టు వీరిపై అభియోగాలు వచ్చాయి. ఈ విషయాన్ని యూఎస్ పోలీసులు బట్టబయలు చేశారు. దేశం నుండి తీసుకువెళ్లే వారిని అక్కడ ప్రముఖ హోటళ్లలో ఉంచి వారివద్దకు విటులను ఈ దంపతులు తీసుకువెళ్ళేవారని అధికారులు వెల్లడించారు. దీనికిగాను విటుల వద్దనుండి 3వేల డాలర్ల వరకు వసూలు చేసేవారట.

ఈ దంపతులను అదుపులోకి తీసుకున్న ఆ దేశ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేరస్తులకు సంబందించిన అన్ని సామజిక మాధ్యమాలను అధికారులు స్వాధీనంలో కి తీసుకుని విచారణ చేస్తున్నారు, ఓ మెయిల్ లో నన్ను ఇటువంటి వృత్తిలోకి దించవద్దని ఓ హీరోయిన్ వేడుకున్న ట్టు కూడా ఉందని అధికారులు స్పష్టం చేశారు. చాలా కాలంగా ఈ వృత్తిలో ఉన్న కిషన్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. పూర్తి విచారణ అనంతరం మీడియా కు వివరాలు వెల్లడిస్తామని యూఎస్ పోలీసులు అన్నారు. ఇటువంటి పనులు చేసి దేశం పరువును అంతర్జాతీయంగా తీస్తున్న వీరికి కఠినాతికఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇక దేశంలో అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో టిగా ఇటువంటి జాడ్యానికి ప్రత్యేక ప్రాంతాలు కూడా ఉన్నాయంటే ఇదికూడా సామజిక జీవన విధానంలో ఒక భాగం అయిపోయినట్టుగా చేసేశారు. కానీ ఇది సరైనది కాదు, ఏమంటే డబ్బు ఎర చూపించో, లేక వారికి కావాల్సినవి దక్కించుకునే దారి అని మాయమాటలు చెప్పి ప్రస్తుతం దేశంలోని యువతని, ఈ వృత్తిలోకి దించుతూ ఇది ఒక పెద్ద మాఫీయాగానే మారిపోయింది. ఈ విషసంస్కృతి ఇలాగే కొనసాగితే రేపటి పౌరులకు ఇదే ప్రధాన వృత్తి అనే తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఎంతైనా ఉంది.

ఆ పసి కునలకు ఏమి తెలుసు…చీకటిలోనే వారిని ఉంచితే అంతా చీకటిగానే ఉంటుందనుకొని అదే ప్రపంచం అనుకోని జీవిస్తారు, వారి తప్పు కాదు అది…వారికి అటువంటి జీవితాన్ని ఇచ్చిన మన పొరపాటే వారికి ఆ జీవితం అనే శాపం.