telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైన్ షాపుల విషయంలో సమీక్ష తరువాత నిర్ణయం: మంత్రి శ్రీనివాస గౌడ్

srinivas goud minister

రాష్ట్రంలో మద్యం లభించక, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య పెరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస గౌడ్ అన్నారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్యాధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన మద్యం షాపులను తిరిగి తెరిపించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ ప్రకృతి సిద్ధంగా లభించే తాటికల్లుపై మినహా మిగతా అన్ని రకాల మత్తు పదార్థాలపైనా నిషేధం కొనసాగుతుందన్నారు. వైన్ షాపుల విషయంలో ఇతర రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో పరిశీలించి, ఆపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం మేరకు షాపులు ఓపెన్ చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.

మద్యం షాపులను తెరిస్తే, అక్కడ జనాలు అధికంగా గుమికూడతారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కారణంతోనే షాపులను తెరిచేందుకు అనుమతించలేదని, పరిస్థితి చక్కబడిందని భావిస్తే, షాపులను తెరిచేందుకు అనుమతించే అవకాశాలుంటాయని అన్నారు. మద్యం షాపుల సీల్స్ తొలగించి మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts