*యూనివర్సిటీలో గబ్బు లేపిన వీసీ.
*వినాయక నిమజ్జనం తరువాత గర్ల్స్ హాస్టల్ లో వీసీ అమ్మాయిలతో చిందులు
*ఆయన చేసిన పనిపై విద్యార్థి సంఘాలు,విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపాటు
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్( వీసీ) రవీందర్ గుప్తాపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి . గణేష్ నిమజ్జనం తర్వాత.. గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలతో కలిసి ఆయన డీజే పాటలకు చిందులేశారు.
తనతో కలిసి చిందులేసిన అమ్మాయిల పై వీసీ రవీందర్ గుప్తా డబ్బులు ఎగురవేస్తూ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన చేసిన పనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకున్నా వీసీతో పాటు హాస్టల్‌లోకి ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వచ్చారని, హాస్టల్‌లో డాన్స్ చేస్తూ డబ్బులు పంచారని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనలో వీసీ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అంతే కాకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసే రవీందర్ గుప్తా గత రెండు రోజుల క్రితం ఓ మహిళా ప్రొఫెసర్ ను దుర్భాషలాడి మరో వివాదానికి తెర తీశారు.
చట్టాల సవరణపై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు: డీకే అరుణ