telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుద‌ల

*తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల
*ఈ ఏడాది ఎంసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలు పై చేయి

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటల 15 నిముషాలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో విడు‌దల చేశారు. ఈ సెట్ లో 90.69 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఏడాది ఎంసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. టాప్‌ ర్యాంక్‌లన్నీ అమ్మాయిలనే వరించాయి. తెలంగాణ ఎంసెట్ లో ఇంజనీరింగ్ విభాగంలో లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి ఫస్ట్ ర్యాంకు సాధించగా,  సెకండ్‌ ర్యాంక్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయి దీపిక సాధించారు.

గుంటూరుకు చెందిన కార్తికేయ మూడో ర్యాంకు సాధించారు.ఇక అగ్రికల్చర్ విభాగంలో గుంటూరుకు చెందిన నేహా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. విశాఖ జిల్లాకు చెందిన లోహిత్ సెకండ్ ర్యాంక్ దక్కించుకున్నారు. గుంటూరుకు చెందిన తరుణ్ మూడో ర్యాంక్ సాధించారు.తెలంగాణ ఎంసెట్ టాప్ ర్యాంకుల్లో ఏపీ విద్యార్ధుల హావా కొనసాగింది. అగ్రికల్చర్ ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో ఏపీ విద్యార్ధులే నిలిచారు

గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31న అగ్రికల్చర్‌, ఫార్మా ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇక తెలంగాణ ఈసెట్‌ 2022 పరీక్ష జులై 1న నిర్వహించగా.. ఈ పరీక్షకు 9,402 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి సబితా వెల్లడించారు

Related posts