తెలంగాణ రాష్ట్ర సమాచార (హక్కు) కమిషన్ (RTI) కు కొత్తగా నియమితులైన కమిషనర్ల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీఫ్ కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి గారు నూతన కమిషనర్లుగా నియమితులైన వారితో ప్రమాణం చేయించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో RTI నూతన కమిషనర్లుగా నియమితులైన పీవీ శ్రీనివాస రావు గారు, మొహిసినా పర్వీన్ గారు, దేశాల భూపాల్ గారు, బోరెడ్డి అయోధ్యా రెడ్డి గారు వరుసగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నూతన కమిషనర్లకు అభినందనలు తెలియజేశారు.