telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మూడేళ్ళ నుండి చలానాలు కట్టని .. తెలంగాణ ఆర్టీసీ … అదనపు చార్జీలతో 15లక్షలు..

passengers fire on tsrtc buses shortage

తెలంగాణ ఆర్టీసీకి భారీగా జరిమానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్లు చెల్లించాల్సిన జరిమానాలు అక్షరాలా రూ. 15 లక్షలు. 2017 జనవరి నుంచి మూడేళ్లలో 2019 ఆగస్టు 31వ తేదీ వరకు మొత్తం చలానాలు 2,964. సామాజిక కార్యకర్త కరీం అన్సారీ సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను రాబట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల కారణంగా రోజూ జరుగుతున్న ప్రమాదాల గురించి మనం రోజు వింటూనే ఉంటాం.. చూస్తూనే ఉంటాం.. అయితే వాటిని నివారించడానికి ప్రభుత్వం కానీ, ట్రాఫిక్ సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా? నిబంధనలు ఉల్లంఘిస్తే సిబ్బందికి ఏమైనా జరిమానాలు విధిస్తున్నారా?’ అనే వివరాలను ట్రాఫిక్ డీసీపీ కార్యాలయం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా అన్సారీ తెలుసుకున్నారు.

ఇప్పటివరకు జరిగిన చెల్లింపులు రూ. 7.03 లక్షలు మాత్రమే. ఇప్పటివరకు ట్రాఫిక్ ఉల్లంఘనలు కింద జారీ అయిన జరిమానా మొత్తాలను చెల్లించాల్సింది డ్రైవర్లే. ఆర్టీసీకి ట్రాఫిక్ జరిమానాలు జారీ అయితే వాటిని సంబంధిత డిపో మేనేజర్లకు పంపిస్తారు. అప్పుడు వాటిని డ్రైవర్ల నుంచి వసూలు చేస్తారు. వాళ్లు వాటిని డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో చెల్లిస్తారు. మూడేళ్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు ఎందుకు కట్టలేదు అనే విషయం గురించి మాత్రం అధికారుల నుంచి సమాధానం లేదు. ఇక ఈ ఒక్క సంవత్సరంలోనే రూ. 4.56 లక్షల మొత్తానికిగాను ఆర్టసీకి 790 చలానాలు జారీ అయ్యాయి. అయితే ఇందులో రూ. 2.61 లక్షలను మాత్రం ఆర్టీసీ చెల్లించింది.

Related posts