telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు కోసం దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేక వైబ్‌సైట్ (www.tsche.ac.in/private-universities)ను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సిటీల కోసం ప్రైవేటు సంస్థలు రూ.50 వేల ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి సూచించారు. దరఖాస్తు ఫారాన్ని నింపి తిరిగి సమర్పించే క్రమంలో నాన్ రిఫండబుల్ కింద రూ.10 లక్షలు చెల్లించాలని తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణకు నెలరోజుల గడువు విధించే అవకాశమున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్‌మహేంద్ర, విట్, గీతం, ఇక్ఫాయ్, కేఎల్ వంటి పలు డీమ్డ్ వర్సిటీలతోపాటు రాష్ట్రంలో కొన్ని అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని పాపిరెడ్డి తెలిపారు.

Related posts