telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీబీకి స్వర నీరాజనం అర్పించిన తెలంగాణ పోలీసు శాఖ

SPB

కారణజన్ముడు, గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి స్వర నీరాజనం అర్పించింది తెలంగాణ పోలీసు శాఖ. హైద్రాబాద్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ వేదికగా ప్రముఖ నటుడు లోహిత్ ఆధ్వర్యంలో.. సాగిన ఈ స్వర నివాళికి జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎం.రమేష్, ఐ.పి.ఎస్ సారధ్యం వహించారు. 27 మధ్యాహ్నం మూడు గంటల నుంచి… రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో ఎం.రమేష్ స్వయంగా రెండు పాటలు ఆలపించడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకులు కోటి, విశ్రాంత ఐ.ఏ.ఎస్.అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో… 19 భాషల్లో 90 వేల పాటలు పాడి, భారతీయ సంగీతంపై చెరగని ముద్ర వేసిన ఎస్పీబీకి ‘భారతరత్న’ ఇవ్వాలని వక్తలు విజ్ఞప్తి చేశారు.

కాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయం అశేష సినీ వర్గాలను విషాదంలో ముంచెత్తింది. కరోనా సోకి కోలుకున్న బాలు అనారోగ్యంతో మరణించారు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. సెప్టెంబర్ 25వ తేదీన మద్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది.

Related posts