telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారీ ట్విస్ట్‌…

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. నల్గగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిన్న పూర్తయింది. అయినా ఎవరికీ 51 శాతం ఓట్లు దక్కలేదు. దీంతో ఫలితం కోసం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు.  నల్గొండ స్థానంలో ఇప్పటి వరకు 67 మంది ఎలిమినేట్‌ అయ్యారు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా 25 వేల 530 ఓట్ల ఆధిక్యంలో ఉండగా…రెండో స్థానంలో మల్లన్న, మూడో స్థానంలో ప్రొ. కోదండరామ్‌ ఉన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొత్తం లక్షా 17 వేల 386 ఓట్లు రాగా..మల్లన్నకు 91,858 ఓట్లు, ప్రొ. కోదండరామ్‌కు 79, 110 ఓట్లు పోల్‌ అయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు మెజారిటీ తగ్గింది. పోటాపోటీగా దూసుకుపోతున్నారు మల్లన్న, కోదండరాం. రెండో ప్రాధాన్యత ఓట్లలో.. పల్లాకు 6586 ఓట్లు రాగా… మల్లన్నకు 8563 ఓట్లు, కోదండంరాంకు 9038 వచ్చాయి. మల్లన్న కంటే 475 ఓట్లు ఎక్కువ సాధించారు కోదండరాం. అయితే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాస్త మెజారిటీ తగ్గింది. కాగా… రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఫలితం తేలే అవకాశం కనిపించకపోవడం గమనార్హం. 

Related posts