telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేంద్ర మంత్రులు తెలంగాణ కు క్షమాపణ చెప్పాలి…

srinivas goud trs

మొన్నటి వరకు కేంద్ర మంత్రులంతా తెలంగాణను ప్రశంసించారని, ప్రధాని సైతం కేసీఆర్ ను ప్రశంసించారని అన్నారు. ఈ రోజు ఎన్నికల కోసం విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రకాష్ జవదేకర్ మేము ఎంఐఎం కు మేయర్ పదవి ఇస్తామనడం హాస్యాస్పదమని అన్నారు. ఇంతకు ముందు ఇచ్చామా? ఇప్పుడెందుకు ఎంఐఎం కు మేయర్ ఇస్తాం? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రం పైనే ఛార్జ్ షీట్ వేయాలని అన్నారు. బీసీ లకు మంత్రిత్వ శాఖ లేనందుకు మీపైనే ఛార్జ్ షీట్ వేయాలని అన్నారు. చైనా పై మీ విధానం వల్ల సంతోష్ అనే మా తెలంగాణ బిడ్డ బార్డర్ లో చనిపోయాడని ఆయన అన్నారు. చలాన్స్ కడతామని దొంగ పనులకు మద్దతు ఇస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు తెలంగాణ కు క్షమాపణ చెప్పి వెళ్ళాలని అలా కాకుండా కేసీఆర్ ను తిడితే మీకు మరిన్ని కష్టాలు వస్తాయని అన్నారు. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించడమే బీజేపీ ఎజెండా అన్న ఆయన  బీజేపీ వేస్తోన్న గలాటా లో టీఆర్ఎస్ నేతలు ఎవరూ చిక్కరని అన్నారు. ఇక సాధారణ వ్యక్తికి అత్యున్నత పదవి ఇచ్చారని స్వయంగా స్వామి గౌడ్ చెప్పారని, అలాంటి వ్యక్తి పార్టీ మారుతారా? అని ప్రశ్నించారు. పెద్ద పదవి చేసిన  అతనికి మళ్ళీ అంతటి పెద్ద పదవి రావాలంటే సమయం పడుతుందని తెలిపారు. 

Related posts